టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిచ్చిన జూపల్లి

కొల్లాపూర్‌, ఐజా మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్‌ రెబల్స్‌ విజయం

Jupally Krishna Rao
Jupally Krishna Rao

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గట్టి షాకే ఇచ్చారు. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపి వారికి గెలిపించుకోవడంలో విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో తనవారికి కాకుండా వేరే వాళ్లకు పార్టీ టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూపల్లి… కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 స్థానాల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపారు. వారిలో 16 మంది విజయం సాధించడం విశేషం. దీంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఆయన మద్దతుదారుల సొంతమైంది.

ఇక ఐజా మున్సిపాలిటీ పరిధిలోనూ జూపల్లి అనుచరుల హవా కొనసాగింది. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లో తన మద్దతుదారులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపిన జూపల్లి… వారిలో పది మందిని గెలిపించుకోవడంతో… ఇక్కడ కూడా ఆయనే కింగ్ మేకర్‌గా మారారు. మొత్తానికి కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన పట్టు నిలుపుకున్న జూపల్లి కృష్ణారావు… టిఆర్‌ఎస్‌కు తన బలమెంతో చూపించినట్టయ్యింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/