ఇరాక్‌ను వీడి తక్షణమే వెనక్కి పోవాలి

బాగ్దాద్‌లో వేలాది మంది ర్యాలీ

Thousands rally in Baghdad
Thousands rally in Baghdad

బాగ్దాద్‌ : అమెరికా సేనలు ఇరాక్‌ను వీడి తక్షణమే వెనక్కి పోవాలన్న నినాదాలతో ఇరాక్‌ హోరెత్తింది. రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం లక్షలాది మందితో బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. డ్రోన్లతో దాడి చేయించి ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిం సొలేమానిని పొట్టన బెట్టుకున్న ట్రంప్‌ కిరాతకంపై ఇరాకీ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే ఇరాక్‌లో బలంగా ఉన్న అమెరికా వ్యతిరేక సెంటిమెంటు సొలేమాని హత్య తరు వాత తీవ్ర రూపం దాల్చింది. రాడికల్‌ షియా తెగకు చెందిన పెద్ద ముఖ్తాదా అల్‌ సదర్‌ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బాగ్దాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహించారు. దాదాపు పది లక్షల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇరాకీ ప్రభుత్వ కార్యాలయం, అమెరికా ఎంబసీతో సహా పలు దేశాల దౌత్య కార్యాలయా లకు దారి తీసే రోడ్లు, వంతెనలు అన్నీ అందోళనకారులతో కిక్కిరిసిపోయాయి. ‘అమెరికా అంతం ఇరాకీయుల పంతం’ ‘అమెరికా మరణం.. ఇజ్రాయిల్‌కూ మరణశాసనమే’ అని రాసిన పోస్టర్లను వారు ప్రదర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/