సిఎం కెసిఆర్‌పై మంత్రి తలసాని పొగడ్తలు

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పొగడ్తలతో ముంచెత్తారు. బడుగ బలహీనవర్గాల కోసం కెసిఆర్‌ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో కొందరు ఎన్నికల సమయంలో మాత్రమే గగ్గోలు పెడతారని అన్నారు. కానీ నిరంతరం బలహీన వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత నిచ్చింది ముమ్మాటికే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి సిఎం కెసిఆర్‌ అభినవ పూలే అని మంత్రి ప్రశంసించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులు డ్రామాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎక్స్‌ అఫీషియా సభ్యులపై అనవసరంగా గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు అయి ఉండి ఒక్క సీటు కూడా గెలిపించుకోలేక పోయారని మంత్రి ఉత్తమ్‌ను ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కు సిగ్గులేకున్నా కెవిపికి లేదా? ఏపి ఎంపి అయిండి నేరేడు చర్లలో గెలవాలనుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/