టాటా మోటార్స్‌ నెక్సాన్‌ ఈవీ లాంచ్‌

నెక్సాన్‌ ఈవీ ప్రారంభ ధర: 13,99000

tata nexon ev launch
tata nexon ev launch

ముంబయి: విద్యుత్ వాహనాలకు పెరగనున్న ఆదరణ నేపథ్యంలో ప్రముఖ కార్ల సంస్థ తన పాపులర్‌మోడల్‌ నెక్సాలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఈ వాహనాల ఉత్పత్తి విషయంలో మరో అడుగు ముందుకేసిన టాటామోటార్స్‌ నెక్సా ఈవీ పేరుతో మంగళవారం లాంచ్‌ చేసింది. టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ జిప్ట్రాన్‌తో దీన్ని రూపొందించింది. ఎక్స్‌జెడ్‌ ప్లస్‌, లగ్జరీ ఎక్స్‌ జెడ్‌ ప్లస్‌, ఎక్స్‌జెడ్‌ ఎం అనే మూడు వేరియంట్లలో, మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రోజు నుండి 22 నగరాల్లోని 60 డీలర్ అవుట్‌లెట్లలో నెక్సాన్ ఈవీ కార్లు అందుబాటులో ఉంటాయి. మరోవైపు నెక్సాన్ ఈవీ బుకింగ్ గత ఏడాది డిసెంబర్ 20 నుండి ప్రారంభమైంది. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.13,99,000 గా ఉండగా, హైఎండ్‌ మోడల్‌ ధర రూ .15,99,000 వరకు ఉంటుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఫాస్ట్ డిసి ఛార్జర్‌లో ప్లగ్ చేసినప్పుడు, నెక్సాన్ ఈవీ 60 శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని 60 నిమిషాల్లో భర్తీ చేస్తుంది. అలాగే 35 మొబైల్ యాప్ బేస్డ్ కనెక్ట్ ఫీచర్లను కూడా నెక్సాన్‌​ ఈవీ అందిస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/