చిరు నివాసంలో సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటి

సినీ పరిశ్రమ ఇబ్బందులపై చర్చలు

minister-talasani-meets-cine-producers

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి నివాసంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈరోజు ఉదయం సమావేశమయ్యారు. ఈభేటిలో సినీ పరిశ్రమ ఇబ్బందులపై చర్చిస్తున్నారు. నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, రాజమౌళి, సి.కల్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి వచ్చారు. ఈ చర్చల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమ, సినిమా థియేటర్లను తిరిగి తెరిచే అంశాలపై కొంత స్పష్టత వస్తుందని సమాచారం.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/