ధమాకా నుండి మాస్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

ధమాకా నుండి మాస్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే చిత్రంలోని పలు సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్..తాజాగా ‘దండ కడియాల్.. దస్తీ రుమాల్’ అంటూ క్యాచీ పదాలతో సాగిన పాట ను రిలీజ్ చేశారు.

ఈ పాటలో రవితేజ్, శ్రీలీల తమ స్టెప్పులతో డ్యాన్స్ ఫ్లోర్‌ను బద్దలు కొట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో స్వయంగా ఈ పాటకు లిరిక్స్ అందించగా.. తనతో కలిసి సాహితి చాగంటి, సింగర్ మంగ్లీ చాలా జోష్‌ఫుల్‌గా ఆలపించారు. మొత్తానికి ఈ ఫాస్ట్ బీట్‌కు హీరోహీరోయిన్ల ఎలక్ట్రిఫైయింగ్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ హై ఎనర్జిటిక్ పాటకు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేయడం విశేషం.

YouTube video