నూతనోత్సాహంతో ప్రజలు ముందుకు సాగాలి

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళి సై

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

హైదరాబాద్‌: 2020 సంవత్సరంలో ప్రజలు నూతనోత్సాహంతో ముందుకు సాగాలని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ కోరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ తమిళి సై మాట్లాడుతూ.. ఆమె తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి నేటికి 100 రోజులు పూర్తయ్యాయని తమిళి సై అన్నారు. రాజ్‌ భవన్‌కు వచ్చిన ప్రజలతో కలవడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు. ఇటీవలే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బ్లడ్‌ డొనేషన్‌ యాప్‌ను విడుదల చేశారని ఆమె గుర్తు చేశారు. రాజ్‌ భవన్‌ ఆధ్వర్యంలో దానిపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరుగుతుందని గవర్నర్‌ అన్నారు. బోడగూడెంకు చెందిన కొంతమంది గిరిజనులు తనను కలిసి వారి సమస్యలను వివరించారు. వారి సమస్యల పరిష్కారానికై శతథా కృషి చేస్తానని గవర్నర్‌ చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/