జీడిమెట్లలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

హైదరాబాద్ జీడిమెట్లలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి చేసి ముగ్గుర్ని అరెస్ట్ చేసారు. జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కా­లనీలో ఓ ఇంట్లో గత కొద్దీ రోజులుగా వ్యభిచారం జరుగుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా ఆ ఇంటి ఫై దాడి చేసారు. ఈ దాడిలో ని­ర్వాహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్‌­(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నా­రు. యువతిని రెస్క్యూ హోంకు తరలించి నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేశారు. పశ్చిమగోదా­వరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు(33) జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కా­లనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గత కొద్దీ రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసారు.

అలాగే నగరంలో కొత్తరకం సెక్స్‌రాకెట్‌ ను పోలీసులు గుట్టురట్టు చేసారు. హైటెక్‌ రీతిలో సెక్స్‌ రాకెట్‌ను నడుపుతున్న ఉగాండా దేశీయులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెక్స్‌రాకెట్‌ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు గుర్తించారు. ఇందులో ఉగాండా దేశీయులతో పాటు అందరూ వీఐపీలే ఉన్నట్లు సమాచారం. బ్యాంక్‌ యాప్‌లో సెక్యూరిటీ మాదిరిగా సెక్స్‌ రాకెట్‌ కోసం ఉగాండా దేశీయులు ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఫ్లాట్‌కు వచ్చే విటులు తప్పనిసరిగా ప్రత్యేక కోడ్‌ వాడితేనే ఎంట్రీ ఉండేలా ప్లాన్ చేసారు. ఈ కొత్తరకం వాడకం చూసి పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు.