సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ హైకమాండ్ వేటు

సచిన్‌ పైలట్‌ ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం

సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ హైకమాండ్ వేటు
sachin-pilot

జైపూర్: రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ కాంగ్రెస్ హైకమాండ్ వేటు వేసింది. ఆయనను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించారు. ఆయన అనుచరవర్గానికి చెందిన మరో ఇద్దరిపై వేటు వేసింది. గెహ్లాట్ ప్రభుత్వాన్ని అస్తిరపరచాలని సచిన్ పైలట్ అనుకున్నారని కాంగ్రెస్ తన ప్రకటనలో పేర్కొంది. అంతకుముందు, రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 104 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు సమాచారం. సోమవారం జరిగిన మొదటి సమావేశంలో సైతం ఇదే సంఖ్యలో ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ప్రకటించారు. కాగా సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి.. గోవింద్ దోత్రాను రాష్ట్ర పీసీసీ కొత్త చీఫ్‌గా ఎంపిక చేసింది.

మరోవైపు తన వెంట 109 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, ప్రభుత్వం స్థిరంగానే ఉన్నదని సీఎం అశోక్ గెహ్లాట్ సోమవారం ధీమా వ్యక్తం చేశారు. అయితే మంగళవారం హోటల్‌లో నిర్వహించిన భేటీలో 102 మంది ఎమ్మెల్యేలే పాల్గొన్నారు. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో అవసరమైన మెజారిటీ మార్కు 101. కాగా 15 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. దీంతో తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని సీఎం గెహ్లాట్ చెబుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/telangana/