జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సీఎం కేసీఆర్ భేటీ

రాంచీ: సీఎం కెసిఆర్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌తో పాటు భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశం కంటే ముందు సీఎం కేసీఆర్ రాంచీలోని గిరిజ‌న ఉద్య‌మ‌కారుడు బిర్సా ముండా విగ్ర‌హానికి సీఎం కేసీఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. బిర్సా ముండా గిరిజ‌న జాతికి, ఈ దేశానికి అందించిన సేవ‌ల‌ను సీఎం కొనియాడారు.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/