బెంగళూరులో దారుణహత్యకు గురైన యువతీ ..

six-murdered-in-nizamabad-district

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి దారుణహత్యకు గురైంది. ఐదు రోజుల క్రితం ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒడిశాకు చెందిన సపన్‌కుమార్ నగర శివారులోని చందాపుర హెడ్‌మాస్టర్ లేఔట్‌లో నాలుగో అంతస్తులో నివసిస్తున్నాడు. 28 ఏళ్ల మహిళ ఆయనతో కలిసి కొంతకాలంగా అక్కడే ఉంటోంది. హత్యకు ముందు వారిద్దరూ కలిసి మద్యం తాగినట్టు ఇంట్లోని పరిస్థితులను బట్టి తెలుస్తోంది. మృతదేహం చుట్టుపక్కల మద్యం సీసాలు, సిగరెట్లు, భోజనం ప్యాకెట్లు పడివున్నాయి. ఐదు రోజుల నుంచి ఇంటి తలుపులు తెరుచుకోకపోవడం, ఇంటి నుంచి దుర్వాస వస్తుండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

వారొచ్చి తలపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నగ్నంగా పడివున్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి సపన్‌కుమార్ కనిపించడం లేదు. అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.