టెక్నికల్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి

Communication skills

జాబ్‌ పొందిలంటే చదువుకు తగ్గవిధంగా హార్డ్‌ లేదంటే అన్వయ నైపుణ్యాలను ఇంజినీరింగ్‌ విద్యార్ధి సముపార్జించాలి. కమ్యూనికేషన్‌, ఇంట్రాపర్సనల్‌ రిలేషన్స్‌, ప్రాబ్లెమ్‌-సాల్వెంగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, సెల్ఫ్‌ మోటివేషన్‌ నైపుణ్యా లను తదునుగుణ్యమైన టెక్నికల్‌ స్కిల్స్‌ను విద్యార్జనలో భాగంగానే అలవర్చుకోవాలి. ఉదాహరణ కు మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌ చేసిన ఎంబిఎ విద్యార్ధుగా పైన పేర్కొన్న నైపుణ్యాలను వృత్తిలో విజయానికి తప్పనిసరిగా నేర్చుకోవాలి.

ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఒకప్పుడు మాన్యఫాక్చరింగ్‌ రంగం స్వర్గధామం. రిక్రూట్‌మెంట్లు అన్నీ అక్కడే ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం ఈ రంగం స్తబ్ధుగా ఉంది పెరిగిన సరఫరాను ఇముడ్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. తర్వాత కాలంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి) ఆస్థాయిని అందుకుంది. అయితే ఇప్పుడు ఆటోమేషన్‌తో డిమాండ్‌ అంతగా ఉండటం లేదు. దీంతో ఉద్యోగిత నైపుణ్యాలు బలంగా ఉన్న ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు మాత్రమే ఐటిలోనైనా, మాన్యుఫాక్చరింగ్‌లోనైనా అవకాశాలు దక్కుతున్నాయి.

ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ కోర్సు కరికులమ్‌లో మార్పులు చోటుచేసుకోవటం లేదు. ఆసోచామ్‌ స్టడీప్రకారం హ్యుమానిటీస్‌లో ప్రతి పదిమందిలో ఒకరు, ఇంజినీరింగ్‌లో ప్రతి నలుగురిలో ఒకరుమాత్రమే ఉద్యోగానికి అర్హత పొందుతున్నారు. మరో నివేదిక ప్రకారం బి-స్కూల్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు ప్రతి అయిదుగురిలో ఒకరే జాబ్‌ పొంద గలిగారు. ఆయా సంస్థల్లో బోధిస్తున్న టీచర్లలో 20 శాతం మంది నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ నిర్దేశించే ప్రమాణాలకు అనుగుణంగా లేరు.
ఈ నేపధ్యంలో ఉద్యోగిత నైపుణ్యాలు అంటే ఏవి, వాటిని ఎలా పొందాలి అన్నది ప్రధాన ప్రశ్నగా ఉంది. రిక్రూటర్ల విషయానికి వస్తే,అభ్యర్ధి అలాగే జాబ్‌ ప్రొఫైళ్ళను సరిచూస్తారు. జాబ్‌ పొందిలంటే చదువుకు తగ్గవిధంగా హార్డ్‌ లేదంటే అన్వయ నైపుణ్యాలను ఇంజినీరింగ్‌ విద్యార్ధి సముపార్జించాలి.

కమ్యూనికేషన్‌, ఇంట్రాపర్సనల్‌ రిలేషన్స్‌, ప్రాబ్లెమ్‌-సాల్వెంగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, సెల్ఫ్‌ మోటివేషన్‌ నైపుణ్యా లను తదునుగుణ్యమైన టెక్నికల్‌ స్కిల్స్‌ను విద్యార్జనలో భాగంగానే అలవర్చుకోవాలి. ఉదాహరణ కు మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌ చేసిన ఎంబిఎ విద్యార్ధుగా పైన పేర్కొన్న నైపుణ్యాలను వృత్తిలో విజయానికి తప్పనిసరిగా నేర్చుకోవాలి. అదేవిధం గా ఒక డాక్టర్‌కు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు తోడు బాగా వినే స్వభావం కలిగి ఉండాలి.

కాన్ఫిడెన్స్‌ బిల్డింగ్‌,మోటివేషన్‌ స్కిల్స్‌కూడా అవసరం ఇంజి నీర్‌గా నిలదొక్కుకోవాలంటే ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, ఇంట్రాపర్సనల్‌ స్కిల్స్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, న్యూమరికల్‌ స్కిల్స్‌ ఉండాలి.
జాబ్‌ స్కిల్స్‌: ఉద్యోగానికి అవసరమైన విధంగా సన్నద్ధతకు నాలుగు సాధారణ సాఫ్ట్‌ స్కిల్స్‌ చాలా అవసరం. ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌: అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించుకోగలగాలి. అలాగే నిర్దేశిత గడువులోపే సదరు ప్రణాళికను సమగ్రంగా అమలు చేయాలి.కమ్యూనికేషన్‌ స్కిల్స్‌: చక్కగా వినడం, తగు విధంగా మాట్లాడ టం,రాయడం, ప్రజంటేషన్‌ నైపుణ్యాలు, ఇంట్రా పర్సనల్‌ స్కిల్స్‌ను అభివృద్ధి పర్చుకోవాలి. ఇతరుల కోణంలో ఆలోచించి చూడగలిగే సామ ర్ధ్యం కూడా ఉండాలి.

నాయకత్వ నైపుణ్యాలు: కామన్‌ విజన్‌ను రూపొందించగలగాలి. వివిధ పనులు సక్రమంగా జరిగేందుకు చొరవ చూపాలి. పని చేసేలా తగుమేర ఒత్తిడి చేయడం. మోటి వేషన్‌, ఇతరులకు తోడ్పాటు అందించడం వంటి వన్నీ నాయకత్వానికి అవసరం.
ఎలా పొందాలి:ఏ నైపుణ్యమైనా సరే కోచింగ్‌లో చేరితే కెరీర్‌కు అనుగుణంగా అలవర్చుకోవచ్చు. విదేశాల్లో చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాల న్నా అదనంగా ఒక భాషపై పట్ట చాలాఅవసరం. చదువుతున్న రోజుల్లోనే కాలేజీలో జరిగే వివిధ కార్యకలాపాలు అంటే సెమినార్లు, డిబేట్లు, కేస్‌, స్టడీస్‌, మాక్‌ పార్లమెంట్‌, సాంస్కృతిక కార్యక్ర మాల్లో పాల్గొనాలి. తద్వారా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు.

కాలేజీ స్పోర్ట్స్‌ బృందంలో ఉంటే టీమ్‌లో పని చేసే సామర్ధ్యాలు పెరుగుతాయి. కోర్సు సంబంధిత ప్రాజెక్టుల్లో పనిచేస్తే పర్సనీలిటీ డెవలప్‌మెంట్‌కు ఆ అనుభవం ఉపయోగపడు తుంది. విలువలు, ఎథిక్స్‌ ప్రాముఖ్యంపై లోతైన అవగాహన కలుగుతుంది.
పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తే ప్రొఫషనల్‌ ప్రపపంచం అర్ధమవుతుంది. లివక్టిన్‌ వంటి బిజినెస్‌ సైట్లతో కెరీర్‌ లీడర్స్‌తో మంచి నెట్‌వర్క్‌ పెంచుకోవచ్చు.
మీ నైపుణ్యాలు, ఆప్టిట్యూడ్‌ తదితరాలు కలలు కనే జాబ్‌కు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునేందుకు మెంటార్‌తో ఒకసారి సంప్రదింపులు జరపడం మంచిది కరెంట్‌ ట్రెండ్స్‌, మెయిన్‌స్రీమ్‌లో ఉండే లాంగ్‌టెర్మ్‌ అవకాశాలు, ఆఫ్‌బీట్‌ కెరీర్స్‌పై మక్కువ చూపే ముం దు విద్యార్ధులు సంబంధిత అన్ని అంశాలపై సునిశితంగా, తార్కికంగా విశ్లేషించుకోవాలి. అవ సరమైన సాఫ్ట్‌ స్కిల్స్‌ విషయంలో రక్షణరేఖకు పై భాగంలోనే ఉంటే మంచి అవకాశాలను ఎవరైనా అందుకోవచ్చు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/