విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు దసరా సెలవులు

Dasara holidays from September 26 to October 9 in Telangana

హైదరాబాద్ః తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 5 న దసరా పండుగ సందర్భంగా ఈ నెల26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది. సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ తేదీన ఆదివారం అవడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయని తెలిపింది. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10వ తేదీన అంటే సోమవారం ప్రారంభం అవుతాయని విద్యా శాఖ స్పష్టం చేసింది.

ఈ సారి 9,10 తరగతులకు సెలవులు తగ్గించాలని భావిస్తున్నట్టు మొదట్లో వార్తలొచ్చినా… తాజాగా మొత్త 15 రోజులు సెలవు దినాలుగా ప్రకటించింది. దీనికి కారణం గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇచ్చారు. అనుకున్న ప్రకారం దసరా సెలవులు ఇస్తే సమయానికి సిలబస్ పూర్తి కాదని.. ఆ తర్వాత పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోందని జోరుగా ప్రచారం సాగింది. అందుకే దసరా సెలవులను ఆయా తరగతులకు కుదించాలని చూస్తున్నట్లు కూడా టాక్ వచ్చింది. తాజాగా వెలువడిన ప్రభుత్వ అధికారిక ప్రకటనతో ఆ ప్రచారానికి తెర పడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/