క్రమశిక్షణతోనే విజయం సాధ్యం

CAREER-

లక్ష్యం చేరుకోవాలంటే క్రమశిక్షణ తప్పనిసరి. మన జీవితం మీద మనకు పట్టు వ్ఞండాలి. ఏది మంచో, ఏది చెడో గ్రహించుకోగల కనీస విచక్షణా శక్తి వ్ఞండాలి. జీవితం చకచకా కదుల్తుంటే అనేక రకాల మనుషులు మనకు తారసిల్లుతారు. వారిలో అనేక రకాల దుర్వ్యాసనాలు మనకు కన్పిస్తాయి. వేశ్యసంపర్కం, అమ్మాయిల ఆకర్షణలో పడటం, తాగుడు, జూదం లాంటి అలవట్లు వ్ఞన్నవాడు ఎపటికీ పైకి రాలేడు. ఒకతను హీరో చిరంజీవిలా చక్కటి పర్సనాలిటీతో వ్ఞంటాడు. అతడి ఫిజిక్‌కి అతడు ఎప్పుడో ప్రముఖ హీరో కావాల్సినవాడు. కాని అతడు పైకి డానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఓ అమ్మాయి వలలో పడ్డాడు. ఆ అమ్మాయి వ్యామోహం నుండి తేరుకొని చూసేసరికి అతడి సమకాలికులైన శ్రీకాంత్‌, గడ్డ చక్రవర్తిలాంటి వారు కాస్తా సైడ్‌ హీరోలుగా పైకి వెళ్లిపోయారు. సర్లే పోతేపోయిందనుకొని అతడు మళ్లీ అతికష్టం మీద ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

తుదకు అతడి ప్రయత్నాలు ఫలించి అవకాశం అతడిని వెతుక్కొని వచ్చింది. అతడు దానిని అందుకోబోతుండగా మరో అమ్మాయి ఆకర్షణలో చిక్కుకున్నాడు. మరోసారి అతడు ఆ మత్తులో మునిగి తేలేసరికి అతడి కంటే జూనియర్లు అయిన అలీ, శ్రీహరిలాంటి వారు కాస్తా హీరోలయిపోయారు. తుదకు అతడి పరిస్థితి ఎలా తయారయిందంటే ఎక్స్‌ట్రా వేషాలకు కూడా పనికిరాకుండాపోయాడు. దీనికంతటికి కారణం అతడిలో క్రమశిక్షణ లోపించడమే!
కాబట్టి విజయపరంపరకి క్రమశిక్షణ చాలా ముఖ్యం చీమలు వేసవి ఆకలమంతా శ్రమించి ఆహారం సేకరించి, చలికాలంలో బయటికి రాకుండా వాటిని తింటాయి. క్రమశిక్షణకి అవి ఉత్తమ ఉదాహరణ. మీరు చూసే వ్ఞంటారు. మిలటరీలో ఎంత క్రమశిక్షణ వ్ఞంటుందో అలాంటి కఠిన క్రమశిక్షణ విజయానికి ఊపిరిలాంటిది. దానిని అలవరచుకుంటే మీరు ఏరంగంలోనైనా విజయాన్ని సాధిస్తారు.
ఉత్తమ ప్రవర్తన ముఖ్యమే
ఒక వ్యక్తి విలువలు, నమ్మకాలు, హావభావాలు అతని వ్యక్తిత్వ స్వభావాన్ని తెలుపుతాయి. దీనినే ఇంగ్లీషులో ‘క్యారెక్టర్‌ అంటారు. జీవితంలో ఉన్నతస్థానం చేరుకోవడానికి చక్కటి క్యారెక్టర్‌ వ్ఞండాలి. మన ప్రవర్తనలో, చర్యల్లో ఈ క్యారెక్టర్‌ ప్రతిఫలిస్తుంది. బిజినెస్‌ సర్కిల్‌లో రాహుల్‌ బజాజ్‌ని మించిన ఉత్తమ ప్రవర్తన గలవారు ఇంకొకరు లేరని చెప్పుకుంటారు. ఎన్నో కష్టాలు పడి 1963లో బజాజ్‌ ఆటో సంస్థని ప్రారంభించిన ఆయన లండన్‌లోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుండి వచ్చాడు. అప్పట్లో మార్కెట్లో నెంబర్‌వన్‌ స్థానాన్ని పొందిన ఆయన ఉద్యోగస్తులతో ఎంతో వినయంగా ఉండటమే కాక వారిలాగే సామాన్య జీవితాన్ని గడుపుతుంటారు. ఇప్పటికీ ఆయన విధేయత, సత్ప్రవర్తన, చిన్నస్థాయివారితో కలివిడిగా వ్ఞండటం ఆయన ఉత్తమ స్వభావానికి నిదర్శనం. వస్తానన్న టైమ్‌కి రాకపోవడం, అబద్దాలు చెప్పడం, కావాలని మర్చిపోయినట్లు నటించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, పనిలో అలసత్వం, బాధ్యతారాహిత్యంగా వ్ఞండటం, గొప్పలు చెప్పుకోవడం లేనిదానిని ఉన్నట్లుగా భ్రమింపచేయ ప్రయత్నించడం ఇవన్నీ ప్రవర్తన లేమితనానికి నిదర్శనం. ఆమె ప్రముఖ గాయని. కోకిల వంటి తన అద్భుత స్వరాన్ని చిన్నప్పట్నుంచి అన్నమాచార్యుల పాటలకే వినియోగించింది. తన గొంతు కేవలం భక్తి గీతాలకే ధారపోస్తానని ఆమె చెప్పేది.

అవసరమైతే ఎటువంటి పారితోషికం తీసుకోకుండా కచేరీలకు వెళ్లుండేది. అలాంటి గానమాధుర్యానికి పరవశమై ఓ పెద్ద నిర్మాత ఆమె వద్దకు వచ్చాడు. పాటకు పాతికవేలు ఇస్తానని, తన సినిమాకు పాడమని ఆమెను కోరాడు. కావాలంటే ఆమె పేరుని గుప్తంగా ఉంచుతానని అభ్యర్థించాడు. ఆమె ఆ అభ్యర్థనని తిరస్కరించింది. అదీ ఉత్తమ క్యారెక్టర్‌ అంటే. ఎంతోమంది ప్రముఖ సినీగాయనీ గాయకుల కంటే మూడు నాలుగురెట్లు పారితోషికం ఆఫర్‌ చేసినా తను నమ్మిన విలువలకు విరుద్ధమైన ఆఫర్‌ను నిర్ధాక్షిణ్యంగా తృణీకరించిన ఆమె వ్యక్తిత్వం హిమాలయ శిఖరం అంత ఉన్నతమైంది. ఉత్తమ క్యారెక్టర్‌ అంటే చిన్నప్పట్నుంచి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండటం మాత్రమే కాదు. మన తప్పులను గుర్తించి ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడం కూడా క్యారెక్టర్‌కు వన్నె తెస్తుంది. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద జ్ఞాని అయినా ఇంకా నేర్చుకోవాల్సింది వ్ఞంటుంది. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. వృద్ధులైనా, నడివయసువారైనా నేర్చుకుంటూనే వ్ఞండాలి.

విజ్ఞానం తరగని గని లాంటిది. ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే వ్ఞంటుంది. ఒక ప్రముఖ డాక్టర్‌ వ్ఞన్నారు. ఆయన పేరుకు సర్జన్‌ అయనా మెడికల్‌ రంగంలో అన్ని మేగజైన్లు క్షుణ్ణంగా చదువ్ఞతారు. ఆయన వయసు 60 సంవత్సరాలైనా ఇప్పటికీ రాత్రి పన్నెండూ, ఒంటిగంట దాకా విజ్ఞాన తృష్ణ కోసం అన్ని సబ్జెక్టులు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొంతమంది వ్యాధి పీడితులు ఎంతోమంది డాక్టర్లని కలిశారు. వారి జబ్బేమిటో ఏ డాక్టరూ చెప్పలేకపోయారు. అలాంటిది పైన చెప్పిన డాక్టర్‌ను కలవగానే ఆయన రోగమేమిటో తేలికగా కనిపెట్టేవారు.

ఇదంతా ఎలా సాధ్యమైంది? నిరంతర విజ్ఞాన తృష్ణవల్ల. ఎంతోమంది పేరుగాంచిన ప్రొఫెసర్లు, కొమ్ములు తిరిగిన డాక్టర్లు సైతం విఫలం కావడానికి కారణం వారు ఎప్పటికప్పుడు వైద్యరంగంలో జరిగే కొత్త పోకడలు తెలుసుకోకపోవడమే. బావిలో కప్పలా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చదివిన చదువ్ఞతో వారు కాలక్షేపం చేయడమే ఈ పరిస్థితికి కారణం. కాబట్టి విజయానికి కావాల్సిందల్లా నిరంతర జ్ఞానతృష్ణ, తదనుగుణంగా విజ్ఞానాన్ని పెంచుకొని నిజజీవితంలో ఉపయోగించడమే.
భాషా చాతుర్యం: ఈ ప్రపంచంలో మనం మనుగడ సాధించాలంటే చక్కటి భాషాచాతుర్యం వ్ఞండాలి. మనం ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి విశ్రమించేదాకా ఎప్పుడూ మాట్లాడుతూనే వ్ఞంటాం. అలా సంభాషించే కళని అద్భుతంగా అలవరచుకొటే జీవితంలో అత్యున్నత సోపానాలను అధిగమించగలం. ఇంతకూ ఈ భాషా పటిమని ఎలా పెంపొందించుకోవాలో గమనిద్దాం.

అసలు మాట్లాడుతుంటేనే కదా మన సంభాషణ చాతుర్యం బయటపడేది. నోరు విప్పకపోతే భాషకి స్థానం ఎక్కడ? ‘మౌనమే నీ భాషా ఓ మూగ మనసా! అన్నది ప్రస్తుత పోటీరంగంలో పనికిరాదు. మన మనసులో మాట బయటకురాకపోతే ఎన్నో పోగొట్టుకుంటాం.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/