గాయం కారణంగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు దూరం

టీం ఇండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు గాయం

Team India opener Shubhman Gill injured
Shubhman Gill

టీం ఇండియా క్రికెట్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ గాయంతో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నాడు. గిల్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ ను జట్టులోకి తీసుకోనున్నారు. అగస్ట్ 4వ తేదీన ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. గిల్ కు తుంటి గాయం తగిలిందని , ఇంకా స్కానింగ్ చేయలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా ప్రస్తుతం గిల్ ఇంగ్లాండ్ సిరీస్ లో కొనసాగుతాడని అతని పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిసింది. చివరి టెస్టుకల్లా కోలుకుంటాడని భావిస్తున్నారు. గిల్ కోలుకొని పక్షంలో మయాంక్ అగర్వాల్ , కి ఎల్ రాహుల్ ఓపెనర్లుగా దిగుతారని భావిస్తున్నారు.

సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/