తెదేపా కేంద్ర కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు

‘బాబు ష్యూరిటీ – భవిష్యత్ కు గ్యారెంటీ’ లో ‘మహాశక్తి’ కవచం ఆవిష్కరణ

vangalapudi-Anita-giving-rakhi-to-Chandrababu
vangalapudi-Anita-giving-rakhi-to-Chandrababu

అమరావతి: భారతీయ సంస్కృతి చాలా విశిష్టమైనది. ఉన్నత మైందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు అన్నారు. బుధవారం ఇక్కడి టీడీపీ జాతీయ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత చంద్రబాబు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పిల్లల కోసమే బ్రతికే ప్రజలు మన భారతీయులు అని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి..వారి భవిష్యత్ గురించి ఆలోచిస్తారని అన్నారు. పిల్లల చదువులు, వారి అవసరాల కోసమే తల్లులు తపిస్తారని , తల్లి భోజనం చేయకపోయినా…పిల్లలకు ముందు పెట్టాలి అని భావిస్తారని అన్నారు. అందుకే నేడు అమెరికాలో కూడా మన సంస్కృతిని ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారని తెలిపారు.

తెలుగుదేశం ఇచ్చిన ‘మహాశక్తి’ అనేది దూరదృష్టితో ఇచ్చిన కార్యక్రమం అని అన్నారు. భవిష్యత్ అవసరాలను గుర్తించి కార్యక్రమాలు తెచ్చే పార్టీ తెలుగుదేశం క్ల్ర్ చెప్పారు. 1986లోనే ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తూ చట్టం చేశారని , మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతీ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం అని తెలిపారు..ఆడపిల్ల పుడితే బాలికా సంరక్షణ పధకం కింద నాడు పుట్టగానే రూ.5 వేలు డిపాజిట్ చేశామని పేర్కొన్నారు. దీంతో ఆడపిల్లలకు ఎంతో మేలు జరిగిందని వివరించారు. రాజకీయాల్లో మహిళల పాత్ర ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం టీడీపీ పోరాడుతుందని వెల్లండించారు. మహిళ మగవారితో సమానంగా పోటీ పడే పరిస్థితి రావాలని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టామని . దీంతో మహిళలు ఎంతో లబ్ది పొందారని తెలిపారు వరకట్నం అనే సమస్య పోయిందన్నారు . ఒక ప్రభుత్వ పాలసీ ద్వారా ఆడబిడ్డల జీవితాలు మార్చామని , ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లు విధానం తీసుకువచ్చింది టీడీపీ అన్నారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం డ్వాక్రా సంఘాలు పెట్టామని, భర్త, తండ్రి, పిల్లలపై మహళలు ఆధారపడకుండా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల జీవితాలు మార్చామన్నారు.

ఆస్తి అంట్ భూమి, డబ్బు కాదు…మనిషి అనేవాళ్లు ఆస్తిగా ఉండాలని అన్నారు. అదే నా ఆలోచన అని తెలిపారు . ఆడబిడ్డ నిధి కింద ఒక్కో మహిళకు రూ.1500 నెలకు ఇస్తామని , పి 4 విధానంతో పేదల జీవితాలు మార్చవచ్చు అని తెలిపారు. నాడు పి3 విధానంతో అనేక మార్పులు వచ్చాయని, . అప్పుడు ఆ స్ఫూర్తి తోనే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్టనర్ షిప్ విధానం ప్రకటించామన్నారు. . దీంతో పేదల జీవితాల్లో పెను మార్పులు తీసుకురావచ్చు ..అని పేర్కొన్నారు.

మహిళలకు ఇంటి నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని , ప్రకటించాను. అవసరం అయితే ఇంకో సిలిండర్ అదనంగా ఉచితంగా ఇద్దామన్నారు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చామని, ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే…నేను ఆత్మస్థైర్యం ఇచ్చానని , దీనితోనే మహిళలు అద్బుతాలు సృష్టించే అవకాశం ఉంది. గట్టి సంకల్పంతో అనుకుంటే ఏదైనా అయిపోతుందని , తెలుగు దేశం గెలవాలి అని గట్టి సంకల్పం చేయిండి. మీ మహిళల జీవితాలు మార్చే బాధ్యత నాది అని అన్నారు. తెలుగు ఆడబిడ్డలను శక్తివంతమైన మహిళలుగా మార్చడమే నా లక్ష్యం అని చంద్ర బాబు పేర్కొన్నారు.

జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/