హైదరాబాద్ టు విజయవాడకు హై స్పీడ్ రైలు

ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తామన్న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌

Minister KTR inaugurates RDO office in Huzurnagar

హుజూర్‌నగర్‌: తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ హుజూర్ నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. హుజూర్ నగర్ పురపాలక సంఘం భవన కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు. పురపాలక సంఘం పరిధిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అర్బన్ పార్క్ నిర్మాణంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ.. హుజూర్ నగర్ లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. హైదరాబాద్ టు విజయవాడకు హై స్పీడ్ రైలు ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తామని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. పార్టీలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదని, ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు. మా ముందున్న లక్ష్యం అభివృద్ధి మాత్రమే అన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేడు సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిటకు వచ్చాయని తెలిపారు. చిట్ట చివరి మనిషి వరకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను అక్రమిస్తే ఉపేక్షించేది లేదని, వారిపట్ల కఠినంగానే ఉంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/