నేటితో కర్ణాటకలో ముగియనున్న ఎన్నికల ప్రచారం

నేటితో కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగియనుంది. గత కొద్దీ రోజులుగా బిజెపి , కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర పార్టీలు తమ ప్రచారం తో ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. తమ అభ్యర్థుల తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, మల్లికర్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ, కుమార స్వామి, దేవేగౌడ వంటి అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ఉచిత హామీలతో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు. ఇక ప్రచార హోరు నేడు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వస్తాయి. ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మాత్రం అవినీతిమయమైన బీజేపీకి మరోసారి అధికారం దక్కదని తేల్చిచెప్పాయి.