నేటితో హరిహర వీరమల్లు వర్క్ షాప్ పూర్తి

డైరెక్టర్ క్రిష్ – పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం హరిహరవీరమల్లు. గత కొద్దీ రోజులుగా వర్క్ షాప్ జరుపుకుంటున్న ఈ మూవీ ..నేటితో వర్క్ షాప్ పూర్తి చేసుకోబోతుంది. ఇప్ప‌టికే వ‌ర్క్‌షాప్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, క్రిష్‌, కీరవాణి టీం వ‌ర్క్ షాప్‌లో పాల్గొన్న స్టిల్స్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ కూడా వీరితోపాటు వ‌ర్క్ షాప్ షెడ్యూల్‌లో జాయిన్ అయింది. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు స్టిక్క‌ర్స్ అతికించ‌బ‌డి ఉన్న బాటిల్స్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..ప్రీ షెడ్యూల్ వ‌ర్క్‌షాప్ చివ‌రి రోజు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు.

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ప్రాజెక్టులో నిధి అగ‌ర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ న‌టులు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎంఎం కీర‌వాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఇప్ప‌టికే విడుద‌లైన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు పోస్ట‌ర్లు, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాయి.