చంద్రబాబు పర్యటనలో అపశృతి..గోదావరిలో పడిన టీడీపీ నేతలు

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు కు చేదు అనుభవం ఎదురైంది. రాజోలు మండలం సోంపల్లి దగ్గర బోటు దిగుతుండగా బరువు ఎక్కువై నీటిలో బోల్తా కొట్టింది. దీంతో బోటులో ఉన్న టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు.. అందర్నీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఈఘటనలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, కొందరు మీడియా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. నదికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. లైఫ్‌జాకెట్ల సాయంతో నీటిలో పడిపోయిన వారిని సురక్షితంగా కాపాడారు. అందరూ ఒడ్డుకు చేరిన తర్వాత చంద్రబాబు రాజోలులంక బయల్దేరారు. ఈ ఘటన లో చంద్రబాబుకు ఏ ప్రమాదం జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.