కేరళలో దారుణం.. ఆర్ధికంగా లాభపడతామని మహిళల నరబలి

ప్రపంచం రోజు రోజు సరికొత్త టెక్నాలజి తో దూసుకుపోతుంటే..కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతూ ప్రాణాలు తీసుకోవడం..ప్రాణాలు తీయడం చేస్తున్నారు. తాజాగా కేరళలో ఆర్థిక కష్టాలు తొలగిపోయి, ఐశ్వర్యం సిద్ధిస్తుందనే మూఢ నమ్మకంతో ఇద్దరు మహిళలను బలి ఇచ్చిన దంపతులను, వారికి సహకరించిన మరో వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను తిరువళ్లకు తీసుకొచ్చి మంత్రతంత్రాలతో బలి ఇచ్చినట్టు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన భగవాల్ సింగ్, లైలా, షఫీ అకా రషీద్ గా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రషీద్ భగవాల్ సింగ్, లైలా అనే దంపతులను నమ్మించి ఇద్దరు మహిళలను బలిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తుయని మాటలతో నమ్మించాడు. ఈ ఇద్దరు మహిళలు జీవనోపాధి కోసం లాటరీ టికెట్లు అమ్ముకునే వారని పోలీసులు తెలిపారు. అందులో ఒక మహిళ అయిన రోసిలి జూన్ లో కనిపించకుండా పోయింది. దీనితో ఆమె కూతురు ఆగష్టు 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మిగిలిన మరో మహిళా పద్మము మిస్సింగ్ కాగా ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న కడవంతర పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఓ ఏజెంట్ మహిళలను తీసుకురావడంలో సహాయం చేశారు. ఫేస్ బుక్ నకిలీ ఖాతా ద్వారా భగవత్ ను కలిసేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో పెరుంబరుకు చెందిన వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో మంచి జరుగుతుందని నమ్మించి తీసుకెళ్లారు. తమ పథకంలో భాగంగా దంపతులు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి పలు రకాల్లో విచారణ చేయగా నరబలి విషయం బయటకు వచ్చింది. వారిని బలి ఇచ్చిన తరువాత ఇద్దరి మృతదేహాలను ఖననం చేశారని తెలుస్తుంది. దీనితో పోలీసులు ఒకరి మృతదేహాన్ని లభ్యం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కేరళలో సంచలనంగా మారింది.