భారీ అగ్నిప్రమాదం.. 8 మంది చిన్నారులతో సహా 12 మంది మృతి

అమెరికా: అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో చిన్నారులు సహా పలువురు చనిపోయారు. ఈ ఇంట్లో 26 మంది నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫిలడెల్ఫియాలోని రెండంతస్తుల ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది పిల్లలతో సహా 12 మంది మరణించారు. ఈ మేరకు అగ్నిమాపక అధికారులు సమాచారం అందించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను ఆస్పత్రికి తరలించామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదం గురించి ఇంటిని అప్రమత్తం చేసిన అలారం పని చేయలేదని, దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/