పంజాబ్ సీఎం హాస్పటల్ పాలవడానికి కారణం ఆ నీరు తాగడంవల్లేనా..?

,

తీవ్ర కడుపు నొప్పితో పంజాబ్ సీఎం భగవంత్​ మాన్​ ఢిల్లీలోని అపోలో హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆయనను అక్కడి వైద్యులు ప్రత్యేకంగా టెస్ట్ లు చేశారు. కాగా పంజాబ్ సీఎం అస్వస్థతకు గురికావడం వెనుక పవిత్ర నదిగా భావించే కాలీ బీన్ నుంచి ఓ గ్లాస్ నీళ్లు తాగడమే వల్లే అంటున్నారు.

రాజ్యసభ సభ్యుడు బాబా బల్బీర్ సింగ్ సీచేవాల్ ఆహ్వానం మేరకు కాలీ బీన్ నది (సట్లజ్ ఉపనది) 22వ శుభ్రతా వారోత్సవాలకు పంజాబ్ సీఎం భగవత్ మన్ హాజరయ్యారు. పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్ లోధి వద్ద ఉన్న ఆ నదీ జలాలను పవిత్రమైనవిగా భావిస్తారు. ఆ నదిలో నుంచి గ్లాస్ నీళ్లను తీసుకొని తాగిన మన్ అనారోగ్యం బారిన పడ్డారు. వాస్తవానికి ఆ నీళ్లలో ఎగువన ఉన్న పట్టణాలు, గ్రామాల నుంచి మురుగునీరు కలుస్తుంది. అయినప్పటికీ ఎలాంటి సంకోచం లేకుండా ఆయన ఆ నీటిని తాగారు. దేవుడి ఆశీస్సులు పొందినట్లుగా ఆయన భావించారని ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది. కానీ ఆ తర్వాత రెండు రోజులకు పంజాబ్ సీఎం చికిత్స కోసం ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో చేరారు.