బీహార్ ఎగ్జిట్ పోల్స్ : ‘మహాకూటమి’కే ఆధిక్యం

138 స్థానాల్లో విజయం లభించే అవకాశాలున్నాయని వెల్లడి

Bihar Exit Polls-Alliance leads
Bihar Exit Polls-Alliance leads

Patna: మహాకూటమికే స్వల్ప ఆధిక్యత వచ్చే అవకాశం ఉందని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ తేల్చేసింది.

మొత్తం మీద బీహార్ లో హంగ్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. మహా కూటమికి 118 నుంచి 138 స్థానాల్లో విజయం లభించే అవకాశాలున్నాయని  జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది.

అలాగే ఎన్డీయేకు 91 నుంచి 117 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది .

ఎల్ జెపీకి 5 నుంచి 8, ఇతరులు 3 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/