”బంగార్రాజు” టీజర్ మాములుగా లేదు

న్యూ ఇయర్ కానుకగా బంగార్రాజు మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. కింగ్ నాగార్జున , చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఇది సిక్వెల్ గా తెర‌కెక్క‌తుంది. ఈ చిత్రంలో నాగ్ “బంగార్రాజు” పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. నాగ్‌ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే..సినిమా ప్రమోషన్ల ను అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పలు సాంగ్స్ విడుదలై ఆకట్టుకోగా.. ఈరోజు టీజర్ ను రిలీజ్ చేసి మరింతగా ఆకట్టుకున్నారు.

ఈ టీజర్ చూస్తుంటే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలే కాక యాక్షన్, డివోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య కూడా తండ్రి లాంటి క్యారెక్టర్ తో అదరగొట్టేసాడు. ఇక మన బేబమ్మ తన అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంటుంది అని అర్ధమవుతుంది. ఇందులో కృతిశెట్టి ఊరి సర్పంచ్ గా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నాగార్జునకి, నాగ చైతన్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో మాత్రం టీజర్ లో రివీల్ చేయలేదు. ఇక ఈ ‘బంగార్రాజు’ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావొచ్చు.