తెలంగాణ టిడిపికి బిగ్ షాక్

బిఆర్ఎస్‌లోకి ఆ పార్టీ పొలిట్ బ్యూరో చీఫ్ రావుల!

tdp-leader-ravula-chandra-shekar-reddy-ready-to-quit-party

హైదరాబాద్‌ః అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో టిడిపికి భారీ షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి బిఆర్ఎస్‌ గూటికి చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆ పార్టీ నేతలతో చర్చించారని, త్వరలోనే కారెక్కడం పక్కా అని సమాచారం. ఈ నెల 15లోగా ఆయన నిర్ణయం తీసుకుంటారని సన్నిహిత వర్గాల సమాచారం.

1994, 2009లో వనపర్తి నుంచి టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రావుల.. ఉమ్మడి ఏపీ విప్‌గా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టిడిపి నేతలంతా పార్టీని వీడి వివిధ పార్టీల్లో చేరినా.. ఆయన మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ప్రస్తుతం ఆయన టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా, పార్టీని వీడబోతున్నారన్న ప్రచారంపై రావుల ఇప్పటి వరకు స్పందించలేదు.