చంద్రబాబు ఫై నిప్పులు చెరిగిన వాసిరెడ్డి పద్మ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు , ఆ పార్టీ నేత బోండా ఉమా ఫై మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబుకు, ఆ పార్టీ నేత బోండా ఉమకు నోటీసులు జారీ చేయడానికి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని…బోండా ఉమ మహిళా కమిషన్ సుప్రీమా అంటున్నారని ఫైర్ అయ్యారు. బోండా ఉమ లాంటి ఆకురౌడీలకు మహిళ కమిషన్ సుప్రీమేనని…బాధితుల్ని పరామర్శించడం చంద్రబాబుకు తెలియదని నిప్పులు చెరిగారు.

బాధితురాలి మంచం దగ్గర కూడా 50 మంది ఉన్నారు…అత్యాచార బాధితురాలిని ఇలా పరామర్శిస్తారా..? అని ప్రశ్నించారు. అత్యాచారం జరిగితే రాజకీయం చేస్తారా..? రాజకీయం కన్నా మానవత్వం మరిచారనే సమన్లిచ్చామన్నారు. అత్యాచార బాధితురాలి గదిలో కేకలు వేస్తారా…మహిళా కమిషన్ ఛైర్ పర్సనుపై ప్రవర్తించే తీరు ఇదేనా..? అని స్పష్టం చేశారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్‌ ఛైర్మన్‌పై టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగడాన్ని కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయమై చంద్రబాబు, బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్‌ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 27 ఉ.11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమా స్వయంగా రావాలని వాసిరెడ్డి పద్మ ఆ సమన్లలో ఆదేశించారు.