టిడిపి నేత బీటెక్ రవి రిమాండ్ పొడిగింపు

TDP leader B Tech Ravi remand extended

అమరావతిః టిడిపి పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బీటెక్ రవి జ్యుడీషియల్ రిమాండ్ ను కడప మేజిస్ట్రేట్ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. డిసెంబర్ 11 వరకు రిమాండ్ ను పొడిగించింది. దీంతో పోలీసులు ఆయనను కోర్టు నుంచి జైలుకు తరలించారు. జనవరి 25న కడప విమానాశ్రయం దగ్గర పోలీసులలో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో రవిపై కేసు నమోదయింది. ఈ నెల 14న వల్లూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.