విదేశాంగ మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ

ఉక్రెయిన్‌లో ఉన్న 1,481 మంది ఏపీ విద్యార్థులకు సాయం చేయాలని విన‌తి

అమరావతి : ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుండ‌డంతో ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్థులు చిక్కుకుపోయిన విష‌యం తెలిసిందే. దీనిపై కేంద్ర విదేశాంగ‌ మంత్రి జైశంకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులకు సాయం చేయాలని ఆయ‌న కోరారు.

లేఖ‌లో 1,481 మంది వివరాలను జైశంక‌ర్‌కు చంద్రబాబు పంపారు. ప్రస్తుతం బుకారెస్ట్, బుడాపెస్ట్ నుంచే విద్యార్థులను అధికారులు తరలిస్తున్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. స్లోవాకియా, మల్దోవ్స్, పోలాండ్‌ల నుంచి కూడా ప్రత్యేక విమానాలు నడిపి విద్యార్థులను తీసుకురావాలని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/