భారత్‌లో మరో కరోనా మరణం

దేశంలో మూడుకు చేరిన మరణాల సంఖ్య

coronavirus
coronavirus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతుంది. ఈవైరస్‌ బారిన పడి భారత్‌లో ఇప్పటికే ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో కరోనా మరణం సంభవించింది. మహారాష్ట్రకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. ముంబయిలోని కస్తుర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే చనిపోయాడు. కాగా భారత్‌లో ఇప్పటివరకు 219 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 39 కేసులున్నాయి. ఆ తర్వాత కేరళలో 24, హర్యానాలో 14, ఉత్తరప్రదేశ్‌లో 13 కేసులున్నాయి. కర్ణాటకలో కరోనా వైరస్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 8 కేసులున్నాయి. తెలంగాణలో మొత్తం 4 పాజిటివ్ కేసులు నమోదవ్వగా… 1 కేసులో వ్యక్తిని డిశ్చార్జి చేశారు. మిగతా ముగ్గురూ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఏపీలో ఒక పాజిటివ్ కేసు ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/