ఆర్ఆర్ఆర్ ఫై తరణ్ ఆదర్శ్ జోస్యం..ఈయన చెప్పిందే జరగబోతుందా..?

యావత్ సినీ లోకం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 07 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

బాలీవుడ్ పై ‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్ భారీగా ఉండబోతోందని..బాలీవుడ్ పూర్తిగా మెట్రో సెంట్రిక్ సినిమాలను చేయడంలో బిజీగా ఉంది. చాలా కాలం క్రితమే మనం గ్రామీణ ప్రాంతాలను వదిలేశాం. ఇప్పుడు క్రమంగా టైర్-2, టైర్-3 నగరాలు, పట్టణాలను కూడా కోల్పోతున్నాం. ఇదే సమయంలో హిందీలోకి డబ్ అవుతున్న దక్షిణాది చిత్రాలు మెట్రోలు, నాన్ మెట్రోలను కూడా టార్గెట్ చేస్తున్నాయి.

‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ హిందీ చిత్రాలు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో విజయవంతమయ్యాయి. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ వస్తోంది. ఈ సినిమా ఎఫెక్ట్ బాలీవుడ్ పై భారీగా ఉంటుంది. వెయిట్ చేయండి’ అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను తుపానుగా మార్చబోతోందని జోస్యం చెప్పారు. ఈయన ట్వీట్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈయన చెప్పిందే నిజమవుతుందా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

‘ఆర్ఆర్ఆర్’లో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రలు పోషించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ.