వామ్మో..ఆకూ కూర కట్ట రూ.40

మాములుగా ఆకూ కూర కట్ట రూ. 5 లేదా రూ.10 ఉంటుంది. కానీ ఇప్పుడు ఆకూ కూర కట్ట ఏకంగా రూ. 40 కు చేరింది. ఈ ధర చూసి సామాన్య ప్రజలు వామ్మో ఆకూ కురే అని నోర్లు తెరుస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ప్రతిదీ భారీగా పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం తో నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. ఈ తరుణంలో ఆకూ కూర ధరలు కూడా అమాంతం పెరిగాయి. మొన్నటి వరకు 5 , 10 కి వచ్చే ఆకూ కూర కట్ట…ఇప్పుడు తిరుపతి కి రూ. 40 కి చేరింది.

తిరుపతిలో కూరగాయలు, ఆకుకూరలు ధరలు కొండెక్కాయి. ఆకు కూర కట్ట ఏకంగా 40 రూపాయలకు చేరింది. అసలే పెరిగిన నిత్యావసర ధరలతో.. సామాన్యులు తిప్పలు పడుతుంటే.. ఇప్పుడు ఆకుకూరలు కూడా రేట్లు పెరిగిపోయాయి. దీంతో లబోదిబోమంటున్నారు వినియోగదారులు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆకుకూరల పంటలు దెబ్బతినడం, దిగుబడి లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటాయని మార్కెట్ దారులు చెపుతున్నారు. ఈ ధరలు చూసి సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. ఏం కొనే టట్టు లేదు..ఏం తినేటట్లు లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.