ఛలో ట్యాంక్ బండ్ అంటున్న నగరవాసులు

ఆదివారం ట్యాంక్ బండ్ ఫైకి వాహనాలు రాకుండా పోలీసులు దారి మళ్లించడం తో నగరవాసులు ట్యాంక్ బండ్ ఫై ఫుల్ గా ఎంజాయ్ చేసారు. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ నిత్యం వాహనాలతో రద్దీ గా ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే నగరవాసులు ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదించాలని అనుకుంటారు కానీ వాహనాల రద్దీ వల్ల వెళ్లేందుకు వెనుకడుగువేస్తుంటారు. ఇదే విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడం తో ఇక ప్రతి ఆదివారం హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు వాహనాలను ట్యాంక్ బండ్ పైకి రాకుండా చర్యలు తీసుకున్నారు.

దీంతో నిన్న సాయంత్రం నగరవాసులతో ట్యాంక్ బండ్ ఆహ్లదంగా మారింది. హైదరాబాద్ -సికింద్రాబాద్ జంట నగరాలను కలిపే 2.2 కిలోమీటర్ల పొడవైన ఈ ట్యాంక్ బండ్ పై నడిచి ఆనందించారు. పిల్లలు ఆడుకోవడం సైక్లింగ్ చేయడం లేదా స్కేటింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. చాల ఏళ్ల తర్వాత ట్యాంక్ బండ్ వాహనాలు లేకుండా కనిపించిందని ..ఇలా ట్రాఫిక్ మళ్లించినందుకు పోలీసులకు , కేటీఆర్ కు థాంక్స్ చెపుతూ పిక్స్ షేర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు చాలామంది సన్ డే తమ కుటుంబ సభ్యులను తీసుకొని ట్యాంక్ బండ్ పైకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Glad Hyderabadis welcomed a new look & traffic free tank bund initiative that was piloted today 😊 pic.twitter.com/nsc40hK4P8— KTR (@KTRTRS) August 29, 2021

#TankBund – vehicle free Sunday evenings as advised by Minister @KTRTRS
We had recently renovated and the sheer enjoyment and relaxed ways of families is worth all the effort pic.twitter.com/fyS2kPDjNI— Arvind Kumar (@arvindkumar_ias) August 29, 2021