తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు : కోర్ట్ లో లొంగిపోయిన తమ్మినేని కోటేశ్వరరావు

టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావు తో పాటు ఎల్లంపల్లి నాగయ్య ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్య జరిగినప్పటినుంచి వారిద్దరు పరారీలో ఉన్నారు. ఇక ఇప్పుడే వారే కోర్ట్ లో లొంగిపోయారు. ఇప్పటి వరకు ఈ కేసులో రంజన్‌ , గంజిస్వామి , లింగయ్య, బోడపట్ల శ్రీను, నాగేశ్వరరావు లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అగస్ట్ 15 తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బైక్ పై వెళ్తున్న ఆయనను దండగులు కిరాతకంగా పొడిచి చంపారు. కోటేశ్వరరావుతో విభేధాలు రావడంతో కృష్ణయ్య ఇటీవలె టీఆర్ఎస్ లో చేరినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అనుచరుడిగా కొనసాగారు. తన తండ్రి హత్యకు కోటేశ్వరరావు సహా ఆరుగురు వ్యక్తులు కారణమని కృష్ణయ్య కొడుకు నవీన్ గతంలో పోలీసులకు ఫర్యాదు చేశారు.