పోర్న్ సైట్లఫై దృష్టి పెట్టిన తాలిబన్లు

అఫ్గానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు ..రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. వారికీ ఇక తిరుగులేకపోవడం తో వారు చేసిందే న్యాయం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి దృష్టి పోర్న్ సైట్లఫై పడిందని తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. లైంగిక కార్మికులకు తాలిబాన్లు మరణశిక్షను ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

పోర్న్ వెబ్‌సైట్స్ సాయంతో తమ దేశంలోని సెక్స్ వర్కర్లను తాలిబన్లు గుర్తిస్తున్నారని ..విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న ఆఫ్గన్ మహిళలను గుర్తించి, వారికి మరణశిక్ష వేయాలని తాలిబన్లు భావిస్తున్నారని ‘ది సన్’ పత్రిక తెలిపింది. రెండు దశాబ్దాల కిందట 1996 నుంచి 2001 వరకు ఆఫ్గనిస్థాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లు.. పలువురు సెక్స్ వర్కర్లకు బహిరంగ మరణశిక్ష అమలు చేశారు. ఇప్పుడు కూడా తాలిబాన్ యోధులు లైంగిక కార్మికులను గుర్తించి చంపడానికి లేదా సెక్స్ బానిసలుగా చేయడానికి వీలుగా పోర్న్ సైట్‌లను వెతుకుతున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటె అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోన్న తాలిబన్లు.. పాత ప్రభుత్వానికి చెందిన ఈ-మెయిళ్లపై దృష్టిపెట్టారు. వాటి యాక్సెస్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గూగుల్‌ వాటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌ ప్రభుత్వానికి చెందిన ఈ-మెయిల్‌ అకౌంట్లను తాత్కాలికంగా స్తంభింపజేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న గూగుల్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తాలిబన్ల చేతుల్లోకి ప్రభుత్వ డేటాబేస్‌ వెళ్లిపోతే.. గత ప్రభుత్వంలో పనిచేసిన వేలాది మంది ఉద్యోగుల వివరాలు వారు తెలుసుకునేందుకు వీలుంటుంది. తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్‌ ప్రభుత్వంలో పనిచేసిన వారిపై ముష్కరులు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉందని అంటున్నారు.