బెంగాల్‌, ఒడిశాల్లో సెప్టెంబ‌ర్ 30న ఉపఎన్నిక‌లు

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 3 నియోజకవర్గాలకు, ఒడిశాలో ఒక నియోజకవర్గానికి ఎన్నికలను నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరుగుతుందని, ఓట్ల లెక్కింపు అక్టోబరు 3న జరుగుతుందని ఈసీ ప్రకటించింది.


ఈ ఉపఎన్నిక‌ల్లో పోలైన ఓట్ల‌ను అక్టోబ‌ర్ 3న లెక్కించి ఫ‌లితాలు వెల్ల‌డించనున్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టంచేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఎన్నిక‌లు నిర్వ‌హించాలంటూ బెంగాల్‌కు చెందిన అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ గ‌త జూలైలో ఎన్నిక‌ల సంఘానికి విజ్ఞ‌ప్తి చేసింది. ఈ నేప‌థ్యంలో బెంగాల్లో బై ఎల‌క్ష‌న్‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది.


కాగా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/