చెన్నైలో కరోనా కలకలం

ఇద్దరిని గుర్తించిన అధికారులు

suspected-case-of-coronavirus-reported-in-chennai
suspected-case-of-coronavirus-reported-in-chennai

చైన్నై: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకు ఈ వైరస్ దేశాలు, రాష్ట్రాలను దాటేస్తోంది.!. చెన్నై ఎయిర్‌పోర్టులో కరోనా వైరస్ కలకలం రేపింది.!. వల్లూజిన్ అనే ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాకు చెందిన వల్లూజిన్ అనే వ్యక్తి మలేషియా నుంచి చెన్నై వచ్చాడు. రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా.. మరో వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నారు. కాగా ఈ రెండు కేసులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/