బ్యాంకాక్ ట్రిప్‌లో 3రోజులు హోటల్లోనే
కొనసాగుతున్న సుశాంత్ ఎపిసోడ్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా భారీఎత్తున చర్చ సాగుతోంది..
ఓవైపు కరోనాకు సంబంధించిన అప్‌డేట్స్ ఎడతెగని రీతిలో సాగుతుంటే.. సుశాంత్ అంశంపై కొత్త విషయాలు డైలీ బేసిస్‌లో బయటకు వస్తున్నాయి..
సుశాంత్ ఎపిసోడ్‌లో రియా కేంద్రంగా చాలానే చర్చసాగుతోంది.. ఇదిలా ఉంటే తాజాగా ఒక టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ చాలా విలాసంవతంమైన జీవితాన్ని గడుపుతారటూ సంచలన వ్యాఖ్యలుచేశారు.
ఈసందర్భంగా ఆమె చెప్పిన అంశాలు కొత్త చర్చకు తెరతీశాయి.. బ్యాంకాక్‌కు తన మగ స్నేహితులతో కలిసి వెళ్లినట్టుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ సన్నిహితులు మరో ఛానల్‌లో పాల్గొన్నారు. వారు మరికొన్ని విషయాలను బయటపెట్టారు.
వారి మాటల ప్రకారం బ్యాంకాక్ ట్రిప్‌లో సుశాంత్‌తోపటు సారా ఆలీఖాన్ కూడ ఉన్నట్టు చెప్పి కొత్త వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
సుశాంత్ తన స్నేహితులతో పాటు సారా ఆలీఖాన్‌తో కలిసి బ్యాంకాక్ లోని విలాసవంతమైన ఐలాండ్‌లోని ఒక హోటల్‌లో బసచేశారని, ఆ హోటల్ నుంచి సుశాంత్, సారా మూడు రోజులు ఉన్నారని, బయటకు ఒక్కసారి కూడ రాలేదన్నారు.
తామంతా బ్యాంకాక్‌లోని ప్రదేశాలు చూడటానికి వెళ్లినట్టు చెప్పటం కాత్త వివాదానికి తెర తీసింది.. థాయ్ ల్యాండ్ కు సునామీ హెచ్చరికలు రావటంతో బ్యాంకాక్ ట్రిప్ మధ్యలో ఆపేసి సుశాంత్, సారాలు ముంబైకి తిరిగి వచ్చారని వెల్లడించారు..
తాము మాత్రం బ్యాంకాక్‌లోనే ఉండిపోయామని, ఆ సందర్భంగా ఖర్చల కోసం తన ఎటిఎం కార్డు తమకిచ్చినట్టుగా సాబిర్ అహ్మద్ తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/