‘సోలే బ్రతుకే సో బెటర్‌’

ఇప్పటికే రిలీజైన సాంగ్‌కు విశేష స్పందన

Sai dharam Tej
Sai dharam Tej

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గన్పప్పటికీ సినిమాల షూటింగ్స్‌ను ప్లాన్‌చేసుకుంటున్నారు మేకర్స్‌.. కాగా తాజాగా సాయి తేజ్‌ కూడ తన ‘సోలో బ్రతుకే సోబెటర్‌ చిత్రం షూటింగ్‌ను మొదలుపెట్టారు..

ఇక ఈసినిమా నుంచి ఆ మధ్య రిలీజ్‌ అయిన మొదటి వీడియో సాంగ్‌ ‘నో పెళ్లి.. నెటిజన్లను బాగా ఆకట్టుకుంది..

ముఖ్యంగా సాంగ్‌లో వరుణ్‌తేజ్‌, రానా కన్పించి ఆకట్టుకోవటంతో సాంగ్‌ సోషల్‌మీడియాలో అపుడు బాగా వైరల్‌ అయ్యింది..

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం, ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈచిత్రంతో సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రంపై మంచి అంచనాలున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/