దేశంలో కొత్త‌గా 15,823 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743

న్యూఢిల్లీ : దేశంలో కొత్త‌గా 15,823 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. అలాగే, నిన్న‌ 22,844 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రిక‌వ‌రీల సంఖ్య‌ 3,33,42,901కు చేరింది. నిన్న క‌రోనాతో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య‌ 4,51,189కు పెరిగింది.

ఇక ప్రస్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,07,653 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న 50,63,845 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో వినియోగించిన డోసుల సంఖ్య 96,43,79,212కు చేరింది. కేర‌ళ‌లో నిన్న 7,823 క‌రోనా కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఆ రాష్ట్రంలో 106 మంది మృతి చెందారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/