అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్‌..సుప్రీంకోర్టు అంగీకారం

ఈ రిజర్వేషన్ల కల్పనలో వివక్ష లేదన్న సుప్రీంకోర్టు

Supreme Court upholds 10 per cent EWS quota in admissions, jobs

న్యూఢిల్లీః అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన ఆర్థికంగా వెనుక‌బ‌డిన ప్ర‌జ‌ల కోసం (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్)కు కేంద్ర ప్ర‌భుత్వం 10 శాతం 10 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. వీరికి 10 శాతం కోటాను కల్పించడం రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు కాదని సుప్రీంకోర్టు విసృత ధర్మాసనం తెలిపింది. ఇందులో ఎలాంటి వివక్ష లేదని చెప్పింది. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలవరించింది. ఈ రిజర్వేషన్లను నలుగులు జడ్జిలు సమర్థించగా… జస్టిస్ రవీంద్రభట్ మాత్రం వ్యతిరేకించారు.

2019 ఎన్నికలకు ముందు ఈ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లను కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించింది. ఈ రిజర్వేషన్లను సవాల్రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పించిన విష‌యం తెలిసిందే. అయితే

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/