డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి

‘కిమ్స్’ లో చికిత్స పొందుతూ కన్నుమూత

Dr. Kakarla Subbarao -File
Dr. Kakarla Subbarao -File

Hyderabad: ప్రముఖ రేడియాలజిస్ట్ , ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు (96) మృతి చెందారు. . అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ , పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా లో వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. విశాఖ ఆంధ్రా వైద్య కళాశాల నుంచి డాక్టర్ పట్టా అందుకున్నారు. 1951లో హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత 1955లో అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. అమెరికాలోని వివిధ నగరాల్లోని ఆసుపత్రులలో పనిచేశారు.

1956లో ఇండియాకు వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ప్రధాన రేడియాలజిస్ట్‌గా పదోన్నతి పొందారు. 1970లో తిరిగి అమెరికాకు వెళ్లారు. 1986 అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపుమేరకు నిమ్స్ డైరెక్టర్‌గా సేవలు అందించారు. పదేళ్లపాటు ఎలాంటి వేతనం తీసుకోకుండానే సేవలు అందించారు. రేడియాలజీ విభాగంలో అనేక పుస్తకాలు రచించారు. ‘ పద్మశ్రీ’ అవార్డు , రాజీవ్ చక్ర నేషనల్ అవార్డు, నేషనల్ యూనిటీ అవార్డు తో పాటు పలు పురస్కారాలను అందుకున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/