తిరుపతిలో ప్రస్తుత దృశ్యాలు చేసి జనసేనాధినేత ఎమోషనల్ ..

తిరుపతి లో జనసేన నేత నాదెండ్ల మనోహర్ పర్యటించారు. భారీ వర్షాలకు తిరుపతి నగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ చాల ఇల్లులు నీటిలో ఉన్నాయి. ఈ క్రమంలో నాదెండ్ల మనోహర్ తిరుపతిలో పర్యటించి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియపరిచారు. మనోహర్ తెలియపరిచిన వివరాలను పవన్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

ప్రభుత్వం తరఫున బాధితులకు అందుతున్న సహాయం వివరాలను తెలుసుకున్నాం. ఇస్కాన్ అందిస్తున్న భోజనం తప్ప ఎలాంటి సహాయం అందడం లేదని బాధితులు వాపోయినట్టు తెలిసింది. తిరుపతిలో అనేకమంది పేదల ఇల్లు ఇప్పటికీ వరద నీటిలో నానుతున్నాయని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. జనసేన పార్టీ తరఫున నిత్యావసర వస్తువులు అందించామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుండి న్యాయమైన పరిహారం అందేలా బాధితుల పక్షాన నిలిచేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇచ్చారు.

అలాగే జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు మనోహర్. ప్రజలు కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసి జిల్లాకు రూ.2 కోట్ల సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు నాదెండ్ల మనోహర్. బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీగా కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు వచ్చామని.. పార్టీ తరఫున మెడికల్ క్యాంప్‌లు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన రెండు విడతలుగా పర్యటిస్తుందని.. మొదటి విడతలో నష్టాన్ని అంచనా వేస్తామని.. రెండో విడతలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం కష్టాలతో ఉంటే ముఖ్యమంత్రి ఇల్లు కదలకుండా ఏరియల్ సర్వే చేయడం బాధాకరమన్నారు. పరిపాలన దక్షత లేని వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డని.. ఆయనో వర్క్‌ఫ్రం హోం ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు.

తిరుపతిలో అనేకమంది పేదల ఇళ్లు వరద నీళ్ళల్లోనే నానుతూ ఉన్నాయి. సాయినగర్, కేశవాయగుంట, వైకుంఠపురం ఆర్చ్, గాంధీ నగర్ ప్రాంతాల్లో ప్రజల కన్నీళ్లతో తమ బాధలు చెబుతున్నారు. pic.twitter.com/Bms5qDtHXi
— Pawan Kalyan (@PawanKalyan) November 23, 2021

బాధిత ప్రాంతాల్లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పర్యటించి బాధితుల గోడు విని ప్రభుత్వం తరఫున అందుతున్న సహాయానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇస్కాన్ అందిస్తున్న భోజనం మినహా ఎలాంటి సాయం అందడం లేదని బాధితులు వాపోయారు. pic.twitter.com/aZDJ2fwh6k
— Pawan Kalyan (@PawanKalyan) November 23, 2021