తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ
హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయాన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ అయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది. దీంతో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం పేర్కొన్నది. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ భూయాన్‌కు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి కల్పించారు. మరో వైపు ఢిల్లీ, బాంబే, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు కొలీజియం సిఫారసు చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/