ఎంపీ గోరంట్ల మాధవ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం..?

వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉదయం నుండి గోరంట్ల మాధవ్ కు సంబదించిన న్యూడ్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నాది కాదని , మార్ఫింగ్ చేసి ఎవరో పోస్ట్ చేసారని గోరంట్ల మాధవ్ చెప్పుకొస్తున్నప్పటికీ.. యావత్ రాష్ట్ర ప్రజలు మాత్రం గోరంట్ల మాధవ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదును చేసుకొని ప్రతిపక్షపార్టీలు వైస్సార్సీపీ పార్టీ ఫై ..జగన్ ఫై విమర్శలు చేస్తున్నారు.

మరోపక్క గోరంట్ల మాధవ్ వీడియో ఫై పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ నేతల నుంచి విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. ఏ క్షణమైనా మాధవ్‌ను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో వ్యవహారం ఫై వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది ప్రైవేటు వ్యవహారానికి చెందిన వీడియో అని, వైరల్ అయిందని అన్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి (గోరంట్ల మాధవ్) తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరిస్తున్నాడని అన్నారు. ఈ వీడియో మార్ఫింగ్ చేసినదని గోరంట్ల మాధవ్ చెబుతున్నాడని, ఒకవేళ అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే మాత్రం అతడిపై కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓ రాజకీయ పార్టీ ఎంతమేరకు చర్య తీసుకోగలదో ఆ స్థాయిలో చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఆ చర్యలు అందరికీ గుణపాఠంలా ఉంటాయని అన్నారు.