ముగ్గురు అమ్మాయిల కోసం సునీల్ కొత్త అవతారం

కమెడియన్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన సునీల్..ఆ తర్వాత అందాల రాముడు చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేసాడు కానీ అవేవి కూడా పెద్దగా విజయాలు సాదించకపోవడం తో సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. ఈ క్రమంలో మళ్లీ కమెడియన్ గా మారాడు.

ప్రస్తుతం సునీల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు కమెడియన్‌గా చేస్తూనే.. మరోవైపు లీడ్ రోల్‌లో కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య ఓటిటి లో వచ్చిన ‘కలర్‌ఫోటో’ సినిమాలో విలన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఇక రీసెంట్‌గా ఓ ముగ్గురు అమ్మాయిల కోసం ఆయన ‘దేవుడిగా’ మారిపోతున్నారట.

సాయి కృష్ణ ఎన్రెడ్డి డైరెక్షన్లో ‘హెడ్స్ అండ్ టేల్స్’ అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతుంది. శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌కు ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించగా.. ఈ సినిమాలో మనుషుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ మూవీ ని నిర్మిస్తుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 నిర్మిస్తున్న ఓ సినిమాలో సునీల్ దేవుడి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ స్వామిజీ గెటప్‌లో సునీల్ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.