కేసీఆర్ సర్కార్‌పై షర్మిల సెటైర్లు..

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత వైస్ఎస్ షర్మిల మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై సెటైర్లు వేశారు. రాష్ట్రంలో గల్లీకో బారు.. వీధికో వైన్‌షాపు ఉందని.. తాగుబోతు తెలంగాణగా మారుస్తున్నారని షర్మిల తన సోషల్ మీడియా ఖాతాలో విమర్శించారు. కేసీఆర్ పాలనలో పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా తయారైందని..ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీ.. కేసీఆర్‌కి కహానీ’ అని ఆమె ఎద్దేవా చేశారు.

కరోనా చావులు లేవు.. మూడెకరాల భూమి అందని దళితులు లేరు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దొరకని పేదలు లేరు. రాష్ట్రానికి అప్పులు లేవు. తాగుబోతుల తెలంగాణ కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గల్లీకో బారు.. వీధికో వైన్‌షాపు ఉందని.. తాగుబోతు తెలంగాణగా మారుస్తున్నారని షర్మిల విమర్శించారు. పసిబిడ్డల మీద అత్యాచారాలు, నిరుద్యోగుల చావులు, రైతుల ఆత్మహత్యలు లేవంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.