బండ్ల గణేష్ సడెన్ ట్విస్ట్..విష్ణు ప్యానల్ కు ఓటు వేయాలని ట్వీట్

మా ఎన్నికలకు సంబంధించి బండ్ల గణేష్ రోజుకో ట్వీట్ చేస్తూ అందర్నీ ఖంగారుపెడుతున్నారు. ముందు ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ లో జీవిత ఎంట్రీ కావడం తో ఆ ప్యానల్ నుండి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు. నామినేషన్ సైతం వేసాడు. ఆ తర్వాత తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకొని ..ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ ఇచ్చారు. ఇక మరికొద్దీ గంటల్లో పోలింగ్ జరగబోతున్న క్రమంలో మరో ట్విస్ట్ ఇచ్చారు గణేష్.

మంచు విష్ణు ప్యానల్ లో ఉన్న సభ్యుడు నటుడు రఘు బాబు కు ఓటు వేయాలని మా సభ్యులను కోరాడు బండ్ల గణేష్. “మా సభ్యులకు విన్నపం దయచేసి మీ అమూల్యమైన ఓటు జనరల్ సెక్రెటరీగా రఘు బాబు వేసి గెలిపించ వలసినదిగా నా ప్రార్థన మీ బండ్ల గణేష్” అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల్లోనే కాదు అందరిలో కొత్త టెన్షన్ మొదలైంది. అసలు గణేష్ ఏ వైపు ఉన్నాడో అర్ధం కావడం లేదని మాట్లాడుకుంటున్నారు.

మా సభ్యులకు విన్నపం దయచేసి మీ అమూల్యమైన ఓటు జనరల్ సెక్రెటరీగా రఘు బాబు వేసి గెలిపించ వలసినదిగా నా ప్రార్థన మీ బండ్ల గణేష్ 🙏🙏🙏 pic.twitter.com/zFlq3urPCN— BANDLA GANESH. (@ganeshbandla) October 9, 2021