సూర్య ఆరాధన విశిష్టత

ఆధ్యాత్మికం

Sun Worship
Sun Worship

ఈ లోకానికి వెలుగును ప్రసాదించు ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్యుడిని భక్తి శ్రద్దలతో కొలిచిన వారికి ఆరోగ్యంతోబాటు తేజస్సు, మనోవికాసం సౌభాగ్యం, సిద్ధిస్తుంది బుద్ధి వికసిస్తుంది. ఆధ్యాత్మిక పరులు ప్రతి ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధించడం ప్రతీతి.

సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆదిత్య హృదయం స్తోత్రం పఠించడం ద్వారా విజయం చేకూరగలదు. శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేస్తున్న సమయంలో విజయంకోసం ఆగస్త్యు మహాముని ఆదేశం మేరకు ఆదిత్య హృదయం స్తోత్రం పఠించడం ద్వారా విజయం చేకూర గలదు.

శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేస్తున్న సమయంలో విజయం కోసం ఆగస్త్య మహాముని ఆదేశం మేరకు ఆదిత్య హృదయం అనే దివ్యమైన సూర్య మంత్రం పారాయణం చేసాడు శ్రీరాముడు విజయం సాధించాడు.

సూర్య నమస్కారంలలో ఎంతో పవిత్రత వున్నది. మానవ శరీరానికి ఆరోగ్యానికీ ఈ సూర్య నమస్కారం ఎంతగానో ఉపయోగ పడుతుంది. యోగ సాధన ఉదయం నుంచే ఆరంభం అవుతుంది. చీకట్లు చీల్చే వెలుగుల దైవం సూర్యుడు. నవగ్రహాలలో ఉత్తముడు సూర్యభగవానుడు.

మహా భక్తుడు అంజనేయుడు తన చిన్న తనంలో ఆకాశంలో ఎర్రటి పండు ఆకారంలో వున్న సూర్యుడుని మింగి వేయాలని ప్రయత్నం చేసాడు. అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధం ఆంజనేయుడిపై ప్రయోగం చేసి విఫలం చెందాడు. తన విశ్వ రూపం చూసి, తూర్పు, పడమర దిక్కుల్లో ఒక్కొక్కటీ పాదం మోపి సూర్యుని దగ్గర గురూపదేశం పొందాడు హనుమంతుడు సకల చరాచర సృష్టిలో సూర్య కిరణాలు అత్యంత ప్రభావితం కలవి. సూక్ష్మక్రీములను సంహరించే స్వభావం ఈ సూర్య కిరణాలకు ఉన్నది.

పూర్వ సప్త ద్వీప మండల చక్రవర్తిగా కృతవీరుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య శీలధరాదేవి వీరికి సంతానం ఒక ముని శాపం కారణంగా లేకుండా పోయింది. అయితే బృహస్పతి ఉపదేశంతో సూర్యోపాసన చేసాడు. వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమై సప్తసప్త మీస్వరప వ్రతం చేయమని సలహా ఇస్తాడు. అప్పుడు వారికి సంతానం కలుగుతుంది అది దత్త పురాణం గాధ.

మరో గాధ పాండవులు తమ అరణ్య వాసం, సమయంలో వారి దగ్గర ఆహార కొరత లేకుండా అక్షయ పాత్ర వుండేది. అది వారికి సూర్య భగవానుడు ప్రసాదించిన వరం. ఇంతటి మహిమ కల అక్షయ పాత్ర వలన పాండవులకు కోరిన ఆహారం లభించేది. ఈ అక్షయ పాత్ర రోజు ఎంత మందికైనా ఆహారం అందిస్తుంది. చివరగా ద్రౌపది భోజనం చేసిన తరువాత అది పని చేయదు. ఇంత మంచి సౌకర్యం పాండవులు కోసం సూర్య భగవానుడు ప్రసాదించిన గొప్ప వరం.

‘అక్షయపాత్ర దీని ద్వారా పాండవులు భయం కర అరణ్యంలో వనవాస సమయంలో ఎంత మంది అతిధులు వచ్చినా పడ్రసోపేతమైన భోజనం పెట్టి పంపించేవారు. ‘తం సూర్య ప్రణమామ్యహం అంటూ ఉదయం లేవగానే సూర్య భగవానుడిని రెండు చేతులెత్తి నమస్కారం చేయాలి. అప్పుడే సూర్యదేవుడు మనల్ని కరుణించి కాపాడగలడు.

ఏడు గుర్రాల రధంపై ముందుకు సాగుతున్న కాల చక్రం అధిపతి, అయినటువంటి నవగ్రహ అధిపతి సూర్యుడు. అందరి కంటే గొప్పవాడు. అంత ేకాదు అయిన పుట్టినరోజు ప్రతీ ఏటా రధ సప్తమి వేడుకల రోజునే సూర్య భగవానుడి పుట్టినరోజు వేడుకగా చేస్తారు.

ఆదిత్య హృదయంలో సూర్యభగవానుడి గురించి చక్కగా అభిర్ణించారు. ప్రతీ నిత్యం ఈ ఆదిత్య హృదయం పఠించిన వారు యవ్వ నంతో ఆరోగ్యంగా వుంటారు. అనే నమ్మకం వుంది. మయూరుడు అనే భక్తుడు శ్వేత కుష్ఠు వ్యాధితో బాధపడే వాడు. కొందరు మహా మునులు సూర్య ఆరాధన చేయమని సలహా నిచ్చారు. సూర్యుని పై భక్తి ప్రపత్తులతో సూర్యశతకం పేరిట మయూర శతకం రచించిదాని సూర్యునికే అంకితం ఇచ్చాడు.

ఆదిత్య హృదయం చదివిన అనంతరం మయూరుడికి వెంటనే తన వ్యాధి నయమైంది ఈ విషయం
పదిమందికీ చెప్పి పారాయణం చేయించాడు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/