శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుద‌ల

తిరుమల : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల‌ను టీటీడీ విడుద‌ల చేసింది. ఆగ‌స్టు నెల‌కి సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార ఆగస్టు నెల టికెట్ల కోటాను విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, సంబంధించి అష్టదళ పాదపద్మారాధన సేవా టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నది.

ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పిస్తుండగా.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా సేవా టికెట్లు పొందిన భక్తులకు టీటీడీ సమాచారం అందివ్వనున్నది. భ‌క్తులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే జూలై, ఆగస్ట్‌ నెలలకు సంబంధించిన వ‌ర్చువ‌ల్ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్రదీపాలంకరణ సేవ టికెట్ల కోటా బుధవారం విడుదల కానున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/